ఆగస్టు 5న ‘సీతారామం’

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక మందన్న ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే

Published : 26 May 2022 02:07 IST

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక మందన్న ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. తెలుగుతోపాటు తమిళ, మలయాళం భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘లెఫ్టినెంట్‌ రామ్‌, సీతల మధ్య అల్లుకున్న కథ ఇది. ‘ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘ఓ సీతా... హే రామా’ అనే పాటని ఇటీవలే విడుదల చేశాం. సంగీత ప్రేమికుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా శ్రోతల నుంచి చక్కటి స్పందనని సొంతం చేసుకుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు చిత్రానికి ప్రధానబలం. సుమంత్‌, గౌతమ్‌మేనన్‌, ప్రకాష్‌రాజ్‌, తరుణ్‌భాస్కర్‌ తదితరులు నటించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటుంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి. శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్‌కుమార్‌, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: పీఎస్‌ వినోద్‌, శ్రేయాస్‌ కృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని