‘రానా నాయుడు’ రాక

‘లోకోమోటివ్‌ గ్లోబల్‌’ పతాకంపై వెంకటేష్‌, రానా దగ్గుబాటి మఖ్యపాత్రల్లో రూపొందించిన క్రైం డ్రామా వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. బుధవారంతో షూటింగ్‌ పూర్తైందనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని దర్శకుడు సుపర్ణ్‌ వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా

Published : 26 May 2022 02:07 IST

‘లోకోమోటివ్‌ గ్లోబల్‌’ పతాకంపై వెంకటేష్‌, రానా దగ్గుబాటి మఖ్యపాత్రల్లో రూపొందించిన క్రైం డ్రామా వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. బుధవారంతో షూటింగ్‌ పూర్తైందనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని దర్శకుడు సుపర్ణ్‌ వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ‘షూటింగ్‌ ముగిసింది’ అని రాసి ఉన్న క్లాప్‌బోర్డ్‌ ఫొటోని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అత్యంత విజయవంతమైన ఫ్యామిలీ మ్యాన్‌-2 సిరీస్‌కి వర్మనే దర్శకుడు. ఈ వెబ్‌సిరీస్‌ హక్కులను వయాకాం సీబీఎస్‌ గ్లోబల్‌ డిస్ట్రిబ్యూషన్‌ గ్రూపు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని