సూపర్‌ హీరోయిన్‌ కథ

వెండితెరపై సూపర్‌మేన్‌లుగా కథా  నాయకులు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు అందరినీ అలరిస్తుంటాయి ఆ   విన్యాసాలు. ఇప్పుడు సూపర్‌ మేన్‌ల తరహాలో

Updated : 27 May 2022 09:51 IST

వెండితెరపై సూపర్‌మేన్‌లుగా కథా  నాయకులు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు అందరినీ అలరిస్తుంటాయి ఆ   విన్యాసాలు. ఇప్పుడు సూపర్‌ మేన్‌ల తరహాలో సూపర్‌ ఉమెన్‌లు వస్తున్నారు. రాగిణి ద్వివేది ప్రధాన పాత్రధారిగా బ్రహ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌ ఉమన్‌ చిత్రం ‘సారి’. కర్మ రిటర్న్‌... అనేది ఉపశీర్షిక. తెలుగుతోపాటు, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. నవీన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. రాగిణి ద్వివేది మాట్లాడుతూ ‘‘ఇదివరకు ఎప్పుడూ చేయని సవాల్‌తో కూడిన ఓ పాత్రని చేస్తున్నా. నన్ను మరో కొత్త కోణంలో ఆవిష్కరించనున్న ఈ చిత్రంలో నటించడానికి ఎంతో ఆస్కారం ఉంది. తెలుగులో ఇదివరకు నటించినప్పటికీ, ఇతర భాషల్లో బిజీగా ఉండటంతో ఇక్కడ ఎక్కువ చిత్రాలు చేయలేకపోయా. ఇకపై  తెలుగు చిత్రాలకే ప్రాధాన్యమిస్తా’’ అన్నారు. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రమిది. రాగిణి ద్వివేది నట విశ్వరూపం చూస్తారు. జూన్‌ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ షురూ అవుతుందని సహనిర్మాత జై కృపాలిని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజీవ్‌ గణేశన్‌, సంగీతం: రాజు ఎమ్మిగనూరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని