ఒకే సినిమాలో 5 పాత్రలతో నట విశ్వరూపం

ఎన్టీఆర్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు - భీముడు’.కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం

Updated : 28 May 2022 07:27 IST

* ఎన్టీఆర్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు - భీముడు’.
*కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. దీనికి ఆయనే నిర్మాత, దర్శకుడు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా.
* 1979లో విడుదలైన ‘శ్రీ మద్విరాట పర్వం’లో 5 పాత్రల్లో నటించారు. బృహన్నల, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడి పాత్రల్లో నట విశ్వరూపాన్ని చూపించారు.
* స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కల్యాణం’లో రావణుడిగా కనిపించి ప్రతినాయకుడిగానూ తనకు తిరుగులేదని పేరు తెచ్చుకున్నారు.
* ముఖ్యమంత్రిగా ఉంటూనే కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’.


 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు