Chaitanya Krishna: చైతన్యకృష్ణ హీరోగా...

నందమూరి కుటుంబం నుంచి మరో కథానాయకుకుడు పరిచయం అవుతున్నారు. ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ... బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయడంతోపాటు, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని పరిచయం చేస్తూ సినిమాని నిర్మిస్తున్నారు.

Updated : 29 May 2022 08:22 IST

నందమూరి కుటుంబం నుంచి మరో కథానాయకుకుడు పరిచయం అవుతున్నారు. ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ... బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయడంతోపాటు, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని పరిచయం చేస్తూ సినిమాని నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ సంస్థని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నిర్మాణ సంస్థకి శ్రీకారం చుట్టిన మా అన్నయ్య జయకృష్ణకి అభినందనలు. ఇది మా అన్నదమ్ములందరి నిర్మాణ సంస్థ. మా అమ్మనాన్నల పేర్లు  కలిసొచ్చేలా పేరు పెట్టడం, చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది. నాన్నకి చైతన్యకృష్ణ చాలా ఇష్టమైన మనవడు. తను ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నా. వైవిధ్యమైన కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వంశీకృష్ణకి నా అభినందనలు’’ అన్నారు. నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ ‘‘మా తమ్ముడు బాలకృష్ణ చేతులమీదుగా నిర్మాణ సంస్థ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ సినిమా పేరు, మిగతా వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని