Tollywood: నాగచైతన్య చిత్రం ప్రారంభం

మరోసారి జోడీ కట్టారు నాగచైతన్య, కృతిశెట్టి. ‘బంగార్రాజు’తో సందడి చేసిన ఈ ఇద్దరూ నాయకానాయికలుగా..

Updated : 24 Jun 2022 08:10 IST

మరోసారి జోడీ కట్టారు నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి (Krithi Shetty). ‘బంగార్రాజు’తో(Bangarraju) సందడి చేసిన ఈ ఇద్దరూ నాయకానాయికలుగా... వెంకట్‌ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పకులు. నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) క్లాప్‌నివ్వగా, కథానాయకుడు రానా దగ్గుబాటి(Rana) కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భారతీరాజా, దర్శకుడు ఎన్‌.లింగుస్వామి, నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. కథానాయకుడు శివకార్తికేయన్‌, సినీ ప్రముఖులు గంగై అమరన్‌, యువన్‌ శంకర్‌రాజా, ప్రేమ్‌జీ ఈ వేడుకకి హాజరయ్యారు. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్‌ శంకర్‌ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకులుగా ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న తొలి చిత్రమిదే. ‘‘అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న చిత్రమిది. జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.


ఆకట్టుకునే అరుదైన కథ ఇది

విష్వక్‌ సేన్‌ (Vishwak sen), ఐశ్వర్య అర్జున్‌(Aishwarya) జంటగా ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun) స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు(Jagapathi Babu) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) క్లాప్‌ కొట్టారు. ప్రకాశ్‌ రాజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శక నిర్మాత అర్జున్‌ మాట్లాడుతూ ‘‘1984లో ఓ తెలుగు సినిమా అవకాశం వస్తే చేయనని చెప్పా. దర్శకుడు కారణం అడిగితే.. ‘‘దర్శకుడిగా ఇది నా 13వ సినిమా. నిర్మాతగా 15వ చిత్రం. మంచి ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. చాలా అరుదైన జానర్‌. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ చేస్తామన్నారు. విష్వక్‌ అద్భుతమైన హీరో’’ అన్నారు. ‘‘అర్జున్‌ సర్‌ కలవాలని అడిగితే షాకయ్యా. ఎందుకో అర్థం కాలేదు. ‘నేను డైరెక్ట్‌ చేస్తున్న కథ చెప్తా విను’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయా. అంత గొప్ప కథ’’ అన్నారు హీరో విష్వక్‌ సేన్‌. ‘మా’(MAA) ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడిన ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj), మంచు విష్ణుల(Manchu Vishnu) మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్‌ బుర్రా, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, రఫి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని