Sai pallavi: సూర్య సమర్పణలో.. సాయిపల్లవి చిత్రం

ఇటీవలే ‘విరాటపర్వం’తో వెన్నెలగా ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి. ఇప్పుడు ‘గార్గి’తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 25 Jun 2022 08:55 IST

ఇటీవలే ‘విరాటపర్వం’తో (Virataparvam) వెన్నెలగా ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి (Sai Pallavi). ఇప్పుడు ‘గార్గి’తో(Gargi) సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రమిది. గౌతమ్‌ రామచంద్రన్‌ (Gautham Ramachandran) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సమర్పించనున్నారు ప్రముఖ నటులు సూర్య - జ్యోతిక. ఈ విషయాన్ని సూర్య శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో దిగిన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని