Thank You: కాలేజీ జ్ఞాపకాల.. ‘ఫేర్‌వెల్‌’ గీతం

నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ కథానాయికలు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా

Updated : 28 Jun 2022 14:03 IST

నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ కథానాయికలు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రంలోని ‘‘ఫేర్‌వెల్‌’’ అనే గీతాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘మనందరి జీవితాల్లో బెస్ట్‌ టైమ్‌ కాలేజీ లైఫ్‌. ఆ తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సిందే. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలే జీవితాంతం మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ కాలేజీ జీవితాన్ని బాగా ఆస్వాదించండి. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. విడుదల రోజే థియేటర్లో చూడండి. సామాజిక మాధ్యమాల ద్వారా మీ స్పందన తెలియజేయండి. మీ స్పందన కోసం వేచి చూస్తుంటాను’’ అన్నారు. ‘‘మనం’ తర్వాత నాగచైతన్యతో మరోసారి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన దిల్‌ రాజుకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి తమన్‌ అద్భుతమైన సంగీతమందించారు. తప్పకుండా మీకు నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా అందమైన సినిమా ఇది. ఈ చిత్రం చూస్తున్నప్పుడు చైతన్యలో నాగార్జున కనిపించారు. ఈ ‘ఫేర్‌వెల్‌’ పాట మంచి సందర్భంలో వస్తుంది. చూశాక ఉద్వేగానికి గురవుతారు’’ అన్నారు. ‘‘ఐదో తరగతి వరకు అమ్మానాన్నలతో ఉంటాం. తర్వాత స్కూల్‌మేట్స్‌తో కలుస్తాం. ఆ తర్వాత కళాశాలే జీవితం. అంత అనుబంధమున్న ఈ కాలేజీ లైఫ్‌ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగాలకు గురవుతామో ఈ ‘ఫేర్‌వెల్‌’ పాట ద్వారా చెప్పాం. చిత్రం కోసం చైతన్య చాలా శ్రమించారు’’ అన్నారు నిర్మాత.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని