సినీ సమ్మేళనం

సినిమా భాషల మధ్య హద్దుల్ని చెరిపేస్తోంది. ఇదివరకటిలా బాలీవుడ్‌.. టాలీవుడ్‌... కోలీవుడ్‌ అంటూ విడదీసి చూడటం క్రమంగా తగ్గుతోంది. సింహభాగం భారతీయ చిత్రాలుగానే రూపొందుతున్నాయి. విడుదలవుతున్నాయి. ఒక సినిమాలో అన్ని భాషల నటులూ దర్శనమిస్తున్నారు

Published : 28 Jun 2022 01:48 IST

సినిమా భాషల మధ్య హద్దుల్ని చెరిపేస్తోంది. ఇదివరకటిలా బాలీవుడ్‌.. టాలీవుడ్‌... కోలీవుడ్‌ అంటూ విడదీసి చూడటం క్రమంగా తగ్గుతోంది. సింహభాగం భారతీయ చిత్రాలుగానే రూపొందుతున్నాయి. విడుదలవుతున్నాయి. ఒక సినిమాలో అన్ని భాషల నటులూ దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న చిత్రంలో వెంకటేష్‌, పూజాహెగ్డే నటిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణే కనిపించనున్నారు. ఇలా భిన్న భాషలకి చెందిన నటులంతా ఒక చోటకి చేరుతుండడంతో చిత్ర పరిశ్రమల్లో సరికొత్త వాతావరణం కనిపిస్తోంది. వారాంతాల్లోనూ, చిత్రీకరణల విరామంలో ఒకరినొకరు కలుస్తూ, ఆత్మీయతని పంచుకుంటూ, ఆతిథ్యం ఇస్తూ సరదాగా గడుపుతున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం హైదరాబాద్‌లో గడుపుతున్న అమితాబ్‌ బచ్చన్‌ని కె.రాఘవేంద్రరావు, నాని, దుల్కర్‌ సల్మాన్‌, నాగ్‌ అశ్విన్‌ తదితరులు కలిశారు. చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్‌కి రామ్‌చరణ్‌ దంపతులు వాళ్ల ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. వెంకటేష్‌, పూజాహెగ్డే కూడా అందులో పాల్గొన్నారు. ఆ సందర్భాల్లో తీసిన ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని