Madhavan: ఇప్పటివరకూ చూడని సన్నివేశాలుంటాయి
‘‘మన దేశం ప్రపంచానికి ఓ మేథో రాజధాని. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో మనవాళ్లు ప్రపంచం నలుమూలలా సత్తా చాటుతున్నారు. ఆయా రంగాల్ని ముందుండి నడిపిస్తున్నారు. హాలీవుడ్ తరహాలో మనం వాళ్లపై అద్భుతమైన సినిమాలు తీయొచ్ఛు అలా నేను చేసిన ఓ ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు మాధవన్
‘‘మన దేశం ప్రపంచానికి ఓ మేథో రాజధాని. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో మనవాళ్లు ప్రపంచం నలుమూలలా సత్తా చాటుతున్నారు. ఆయా రంగాల్ని ముందుండి నడిపిస్తున్నారు. హాలీవుడ్(Holywood) తరహాలో మనం వాళ్లపై అద్భుతమైన సినిమాలు తీయొచ్ఛు అలా నేను చేసిన ఓ ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు మాధవన్(Madhavan). దక్షిణాదితోపాటు, హిందీ సినిమాలతోనూ సత్తా చాటిన నటుడు మాధవన్. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry The Nambi Effect). ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్(Nambi Narayanan) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ప్రచారం నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌కి వచ్చారు మాధవన్. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలివీ... ●
‘‘మనకు రెండు రకాల దేశభక్తులు ఉంటారు. బుల్లెట్లకి ఎదురొడ్డి జీవితాల్ని త్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్నవాళ్లు ఒకరైతే... అసలే గుర్తింపు లేకుండా జీవితాల్ని పణంగా పెట్టి దేశం కోసం పనిచేస్తున్నవాళ్లు మరొకరు. నంబి నారాయణన్ రెండో రకానికి చెందినవారు. ప్రపంచంలో మరే శాస్త్రవేత్తకి సాధ్యం కానంతగా చేశారు నంబి నారాయణన్. ఆయన ఏం చేశారనేది ఇందులో చూపించాం. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు, కేసుల కంటే ఆయన తన పరిశోధన జీవితంలో ఏం చేశారనే విషయాల్ని చూపించాం. జీవిత కథల్ని తెరకెక్కిస్తున్నప్పుడు మసాలా అంశాల్ని జోడించాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ఆ అవసరమే రాలేదు. తెరపై చూపించిందంతా నిజం అని ప్రేక్షకుడు నమ్మితే చాలనుకుంటూ తీశా. అంత నాటకీయత ఉంటుంది నంబి నారాయణన్ జీవితంలో. తొలిసారి ఈ సినిమాలో రాకెట్ ఇంజిన్ని చూపించాం. పాత్రల్ని సహజంగా, ఎలాంటి ప్రాస్తెటిక్ మేకప్ లేకుండా చూపించే ప్రయత్నం చేశాం. నంబి నారాయణన్‌లా కనిపించేందుకు నా పంటి వరసని మార్చుకున్నా. పాత్రకి తగ్గట్టుగా బరువు పెరగడంతోపాటు, 18 రోజుల్లోనే ఆ బరువు తగ్గి నటించా’’.
‘‘మొదట ఈ సినిమాకి నేను దర్శకత్వం వహించాలనుకోలేదు. ఈ కథ రాశాక ‘నేనే దర్శకత్వం వహించడమా లేక, ఈ కథని ఇలా వదిలేయడమా?’ అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ నటుడు తమిళం, హిందీ, ఇంగ్లిష్... ఈ మూడు భాషల్లో మాట్లాడాలి. అలా మూడు భాషలు తెలిసిన నటుల్నే ఎంపిక చేసుకుని ఈ సినిమా చేశాం’’.
‘‘మనం జేమ్స్‌బాండ్ సినిమాలు, అందులో హీరో పాత్రల్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. రాకెట్ సైన్స్ గురించి, ఇంతరత్రా సాంకేతికాంశాలు, ఆ రంగాల్లో వ్యక్తుల కథలతో వచ్చే హాలీవుడ్ సినిమాల్ని చూసి ‘వీళ్లే భూమిని కాపాడేవాళ్లు. వీళ్లకే ఇదంతా సాధ్యమేమో’ అనుకుంటాం. మన దేశం మేథస్సుకి ఓ హబ్ అనే విషయాన్ని గుర్తించం. బాండ్‌కే బాండ్ అనిపించే భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణన్. ఎన్నెన్నో దేశాలతో ముడిపడిన ఆయన జీవితం గురించి తెలుసుకుంటే ఒక భారతీయుడు ఇంత చేశారా? అని ఆశ్చర్యపోవల్సిందే. ఆయన జీవితంలో సినిమాని మించిన మలుపులు ఉంటాయి. ఇన్ని చేసిన ఓ శాస్త్రవేత్త దేశ రహస్యాల చేరవేత అభియోగాల్ని ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలిశాక నేనెంతగానో కదిలిపోయా. ఆయనకి పద్మభూషణ్ పురస్కారం రాక ముందు కలిసి మీ జీవితంపై సినిమా చేస్తానని చెప్ఫా స్వతహాగా నేను ఇంజినీరింగ్ విద్యార్థిని కావడంతో, ఇంజిన్స్ గురించి, సాంకేతిక విషయాల గురించి అవగాహన ఉండటంతో నేను సినిమా తీయగలనని నమ్మారు నంబి నారాయణన్. ఆరేళ్లపాటు శ్రమించి ఈ సినిమా చేశా. భారతీయ సినిమాలో ఇదివరకెప్పుడూ చూడని సన్నివేశాలు ఇందులో ఉంటాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్