Krishnam Raju: ప్రభాస్‌ ఎదుగుదల ఆనందాన్నిస్తోంది

‘‘ప్రభాస్‌ తొలి సినిమా ‘ఈశ్వర్‌’ చూశాక.. తప్పకుండా తను పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీనికి అతని శ్రమ, పట్టుదలతో పాటు అభిమానుల అండదండలే ప్రధాన కారణం’’ అన్నారు నటుడు, నిర్మాత కృష్ణంరాజు. ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ చిత్రం

Updated : 29 Jun 2022 09:33 IST

‘‘ప్రభాస్‌ (Prabhas) తొలి సినిమా ‘ఈశ్వర్‌’ (Eeswar) చూశాక.. తప్పకుండా తను పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీనికి అతని శ్రమ, పట్టుదలతో పాటు అభిమానుల అండదండలే ప్రధాన కారణం’’ అన్నారు నటుడు, నిర్మాత కృష్ణంరాజు(Krishnam Raju). ప్రభాస్‌ ‘ఈశ్వర్‌’ చిత్రంతో తొలిసారి తెరపై మెరిసిన సంగతి తెలిసిందే. జయంత్‌ సి.పరాన్జీ (jayanth C. Paranjee) దర్శకత్వంలో అశోక్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం.. 2002 జులై 28న హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఇది జరిగి మంగళవారంతో 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని కృష్ణంరాజు స్వగృహంలో ప్రత్యేక వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌ హీరోగా కెమెరా ముందుకొచ్చి అప్పుడే 20ఏళ్లు గడిచిపోయిందా అనిపిస్తోంది. నిజంగా ఆరోజు ప్రభాస్‌ని మా గోపీకృష్ణ బ్యానర్‌లోనే హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. తర్వాత అశోక్‌ కుమార్‌, జయంత్‌ వచ్చి ఆ అవకాశం తమకు ఇమ్మని అడిగారు. ‘ఈశ్వర్‌’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కథ, తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఓకే చెప్పాం. మేమనుకున్నట్లుగానే ఆ చిత్రం విజయవంతమైంది. ప్రభాస్‌ హీరోగా నిలబడ్డాడు. తను మరింత ఎత్తుకు ఎదగాలి. మరిన్ని మంచి విజయాలు అందుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామల(Shyamala), దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ, నిర్మాత అశోక్‌ కుమార్‌, జె.ఎస్‌.ఆర్‌.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని