Agni Nakshatram: తండ్రీతనయల అగ్నినక్షత్రం’

మోహన్‌బాబు, లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండడం ఇదే తొలిసారి. ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి ‘అగ్నినక్షత్రం’

Updated : 02 Jul 2022 07:16 IST

మోహన్‌బాబు (MohanBabu), లక్ష్మీప్రసన్న(Lakshmi) ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండడం ఇదే తొలిసారి. ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి ‘అగ్నినక్షత్రం’ (Agni Nakshatram) అనే పేరుని ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం ఈ పేరుని ప్రకటించారు. ‘పోలీస్‌స్టోరీ’ వంటి ఒక విభిన్నమైన కథతో రూపొందుతోందని, విడుదలైన లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయని సినీవర్గాలు తెలిపాయి. మలయాళీ నటుడు సిద్ధిఖ్‌తోపాటు, సముద్రఖని, విశ్వంత్‌, జబర్దస్త్‌ మహేష్‌, చైత్ర శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: లిజో.కె జోస్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి, కూర్పు: మధురెడ్ఢి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని