Ramarao On Duty: అందిస్తాను వీసా

‘ఒకరికినే మసాలా సీసా.. ఇంకొకరికి రసాల సీసా... అందరికీ అందిస్తాను   స్వర్గానికి వీసా’ అంటోంది  ఓ అమ్మాయి. ఆమె ఎవరో, ఆమె కథేమిటో తెలియాలంటే ‘రామారావు  ఆన్‌ డ్యూటీ’ చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. శ

Updated : 03 Jul 2022 06:57 IST

‘ఒకరికినే మసాలా సీసా.. ఇంకొకరికి రసాల సీసా... అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’ అంటోంది  ఓ అమ్మాయి. ఆమె ఎవరో, ఆమె కథేమిటో తెలియాలంటే ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty) చూడాల్సిందే. రవితేజ(Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. రజిషా విజయన్‌(Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik) కథానాయికలు. శరత్‌ మండవ దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ‘నా పేరు సీసా...’ అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు. ఇందులో రవితేజతో కలిసి అన్వేషి జైన్‌ నృత్యాలు చేశారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ రచించిన ఈ గీతాన్ని, శ్రేయా ఘోషల్‌తో కలిసి ఆలపించడంతోపాటు స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకుడు సామ్‌ సీఎస్‌. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌  చిత్రమిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని