Updated : 05 Jul 2022 07:22 IST

దసరాకి ‘గాడ్‌ఫాదర్‌’

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పకులు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. చిరంజీవి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో దర్శనమిస్తున్నారు. రాజకీయ    నేపథ్యంలో సాగే ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: నీరవ్‌ షా, కళ: సురేష్‌ సెల్వరాజన్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని