నాలుగు భాగాలుగా ‘బింబిసార’

‘‘తాత చేసిన ‘పాతాళభైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేక వీరుని కథ’ మొదలుకొని... ఈమధ్య వచ్చిన ‘బాహుబలి’ వరకు ఎన్నో సోషియో ఫాంటసీ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన మరో చందమామ కథే... మా ‘బింబిసార’ చిత్రం’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌

Published : 05 Jul 2022 06:01 IST

‘‘తాత చేసిన ‘పాతాళభైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేక వీరుని కథ’ మొదలుకొని... ఈమధ్య వచ్చిన ‘బాహుబలి’ వరకు ఎన్నో సోషియో ఫాంటసీ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన మరో చందమామ కథే... మా ‘బింబిసార’ చిత్రం’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంగళవారం కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ఫాంటసీ, వాణిజ్య అంశాల మేళవింపుతో సినిమా ఉంటుంది. మా చిత్రబృందం దీనికోసం చాలా కష్టపడింది. ఈ ఏడాది మా తాత ఎన్టీఆర్‌ శత జయంతి. ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’ అన్నారు. ఈ కథని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది తన ఆలోచన అన్నారు. రెండో భాగం వచ్చే ఏడాది ఆగస్టు 23కి విడుదల చేస్తామని తెలిపారు. 3, 4 భాగాలుగా కూడా రావొచ్చని, అన్నీ కుదిరితే ఎన్టీఆర్‌ కూడా నటిస్తారని తెలిపారు. దర్శకుడు వశిష్ఠ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పిన కథ విన్న మరుక్షణం నుంచి ‘నువ్వు చేయగలవు’ అంటూ కథానాయకుడు కల్యాణ్‌రామ్‌, నిర్మాత హరి ఎంతో ప్రోత్సాహించారు. మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులు తెరపై చూస్తార’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని