Krithi Shetty: ఒత్తిడి ఎదుర్కోక తప్పదు
‘‘నేనెప్పుడూ నాకు సరిపోయే కథల్నే ఎంచుకుంటాను. చేసే ప్రాజెక్ట్ పెద్దదా.. చిన్నదా? అని అసలు ఆలోచించను’’ అంది కృతి శెట్టి. ‘ఉప్పెన’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన ఈ అమ్మడు..
‘‘నేనెప్పుడూ నాకు సరిపోయే కథల్నే ఎంచుకుంటాను. చేసే ప్రాజెక్ట్ పెద్దదా.. చిన్నదా? అని అసలు ఆలోచించను’’ అంది కృతి శెట్టి (Krithi Shetty). ‘ఉప్పెన’తో(Uppena) తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన ఈ అమ్మడు.. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో కెరీర్ కొనసాగించింది. ఇప్పుడు ‘ది వారియర్’తో(The Warriorr) సందడి చేసేందుకు సిద్ధమైంది. రామ్ (Ram) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. లింగుస్వామి (Lingusamy) తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతి శెట్టి.
ఈ ఏడాది మీ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. దీంతోనే తమిళంలోకీ అడుగు పెడుతున్నారు. ఎలా అనిపిస్తోంది?
‘‘చాలా సంతోషంగా ఉంది. ‘ఉప్పెన’ విడుదలయ్యాక తమిళ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. నాపై అంత ప్రేమ చూపిస్తారని అప్పుడు ఊహించలేదు. ఇప్పుడీ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నా’’.
ఈ కథ వినిపించాక మీకేమనిపించింది?
‘‘ఆయన తీసిన ‘ఆవారా’ను చాలా ఏళ్ల క్రితం తమిళంలో చూశా. లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆయన సినిమాల్లో కథానాయికల పాత్రలకూ ఎంతో ప్రాధాన్యముంటుంది. నటనకు ఆస్కారం దొరుకుతుంది. ఈ కథలోనూ ఇవన్నీ కుదిరాయి’’.
మీరు ఆర్జేగా చేశారు. రామ్ పోలీస్. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది?
‘‘పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఉంది. బహుశా.. అక్కడే ప్రేమ పుట్టి ఉండొచ్చు (నవ్వుతూ). అదెలా అన్నది మీరు తెరపై చూసి తెలుసుకోవాలి’’.
నటన, కథల ఎంపిక విషయాల్లో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
‘‘నేనొక కథ విన్నానంటే.. అందులో నేను పోషించనున్న పాత్ర గురించి ఓ నోట్స్ సిద్ధం చేసి పెట్టుకుంటా. ప్రేక్షకుల్ని అలరించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే కథల ఎంపికలో కచ్చితంగా కాస్త ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. ఓ కథ వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేశానంటే.. కచ్చితంగా అది ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతా. ఏ కథ విన్నా.. కచ్చితంగా మా అమ్మ అభిప్రాయాలు తీసుకుంటా. యాక్షన్ పాత్ర... నాకున్న డ్రీమ్ రోల్ అదే’’.
కొత్త చిత్ర విశేషాలేంటి?
‘‘బాలా దర్శకత్వంలో సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నా. దాదాపు 30శాతం చిత్రీకరణ పూర్తయింది. నాగచైతన్యకు జోడీగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నా. నితిన్‌తో చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ వచ్చే నెలలో విడుదలవుతుంది. సుధీర్‌బాబుతో చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు’’.
ఇంతకీ ఈ చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘‘ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. నేనిందులో ఓ పక్కింటి అమ్మాయిలా, క్యూట్‌గా కనిపిస్తా. నా పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి. ఓ రేడియో స్టేషన్లో ఆర్జేగా పనిచేస్తుంటా. కథ విన్న వెంటనే నేనీ పాత్రకు కనెక్ట్ అయిపోయా. ప్రేక్షకులూ అలాగే కనెక్ట్ అవుతారనుకుంటున్నా. ఈ పాత్ర చేయడానికి ముందు నేను చాలా హోంవర్క్ చేశా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..