Liger: ‘లైగర్‌’.. తొలి పాట

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 07 Jul 2022 11:42 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్ర తొలి గీతం ‘‘అక్డీ పక్డీ’’ టీజర్‌ని జులై 8న, పూర్తి పాటను 11న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని  నిర్మాతలు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో విజయ్‌..అనన్యతో విజిల్‌ కొట్టిస్తూ కనిపించారు. ఈ ‘అక్డీ పక్డీ’ పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా.. సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్‌ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని