‘మహా’ జులై 22న

హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ‘మహా’. శింబూ కీలక భూమిక పోషించారు.

Published : 20 Jul 2022 00:57 IST

హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ‘మహా’. శింబూ కీలక భూమిక పోషించారు. మాలిక్‌ స్ట్రీమ్స్‌ కార్పొరేషన్‌, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మదియళగన్‌ నిర్మించగా, యూఆర్‌ జమీల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. ఇది హన్సిక 50వ చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్‌, కరుణాకరన్‌, తంబి రామయ్య ఇతర తారాగణం. జిబ్రాన్‌ సంగీతం అందించగా, జె.లక్ష్మణ్‌ ఛాయాగ్రాహకుడగా పని చేశారు.


నటరత్నాల సందడి

సుదర్శన్‌, రంగస్థలం మహేష్‌, అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రదారులుగా... నర్రా శివనాగు దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం ‘నటరత్నాలు’. ఇనయా సుల్తానా కథానాయిక. డా.దివ్య నిర్మాత. నేరం నేపథ్యంలో సాగే ఈ సినిమా టాకీ భాగం చిత్రీకరణ పూర్తయినట్టు సినీవర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత చెప్పారు. ‘‘హత్యోదంతం చుట్టూ సాగే కథ ఇది. ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంద’’న్నారు దర్శకుడు. అర్చన, శ్రుతి లయ, సుమన్‌ శెట్టి, టైగర్‌ శేషాద్రి నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గిరికుమార్‌.


‘టెహ్రాన్‌’ సెట్‌లోకి మానుషి

జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టెహ్రాన్‌’. ఇందులో కథానాయికగా ఎవరన్న ఊహాగానాలకు తెరపడింది. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ మంగళవారం చిత్ర సెట్‌లోకి అడుగుపెట్టింది. కురచ జుట్టుతో, చేతిలో గన్‌ పట్టుకొని ఉన్న తన ఫస్ట్‌ లుక్‌ని సినీవర్గాలు విడుదల చేశాయి. అక్షయ్‌ కుమార్‌తో ‘పృథ్వీరాజ్‌’ తర్వాత మానుషి నటిస్తున్న రెండో చిత్రం ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా అరుణ్‌ గోపాలన్‌ తెరకెక్కిస్తున్నారు. దినేష్‌ విజన్‌, శోభనా యాదవ్‌, సందీప్‌ లీజెల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని