Bimbisara-2: మరిన్ని హంగులతో ‘బింబిసార-2’

‘‘మంచి కథ అందిస్తే.. థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని ప్రేక్షకులు మా ‘బింబిసార’ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అందుకే ఈ చిత్ర విజయం మాది కాదు.. మీదే. ఇంతటి విజయాన్ని అందించినందుకు...

Updated : 06 Aug 2022 02:25 IST

‘‘మంచి కథ అందిస్తే.. థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని ప్రేక్షకులు మా ‘బింబిసార’ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అందుకే ఈ చిత్ర విజయం మాది కాదు.. మీదే. ఇంతటి విజయాన్ని అందించినందుకు మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కె.హరికృష్ణ నిర్మించారు. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా శుక్రవారం విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ    సందర్భంగా హీరో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘బింబిసారుడు లాంటి గొప్ప పాత్ర నేను చేస్తే బాగుంటుందని నమ్మి.. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చినందుకు దర్శకుడు వశిష్ఠకు థ్యాంక్స్‌. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఛోటా కె.నాయుడు తన ఛాయాగ్రహణంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ విజయంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. ‘బింబిసార-2’ మరింత భారీ స్థాయిలో.. అత్యున్నత గ్రాఫిక్స్‌ హంగులతో ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ, శ్రీనివాస్‌ రెడ్డి, అనిల్‌, తమ్మిరాజు, రామకృష్ణ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని