Rakul: ‘ప్రేమ చాటుకునే అవకాశం అది’

అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది అవుతోంది. తను చివరిసారిగా ‘కొండపొలం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిందీలో చేతి నిండా ప్రాజెక్టులు ఉండటంతో ఇటువైపే చూడటం లేదు. ఇంత తీరిక లేని పరిస్థితుల్లోనూ

Updated : 07 Aug 2022 03:26 IST

గ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది అవుతోంది. తను చివరిసారిగా ‘కొండపొలం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిందీలో చేతి నిండా ప్రాజెక్టులు ఉండటంతో ఇటువైపే చూడటం లేదు. ఇంత తీరిక లేని పరిస్థితుల్లోనూ ఈమధ్యే వీలు చేసుకొని మరీ ‘మషూక’ అనే మ్యూజిక్‌ వీడియో చేశారు. ఈ సింగిల్‌లో అల్ట్రా గ్లామరస్‌ రూపంతో ఆకట్టుకున్నారు. ఈ మ్యూజిక్‌ వీడియో గురించి ఒక ఛానెల్‌తో శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ముందు దీన్ని హిందీ పాప్‌ గీతంగానే రూపొందించాలనుకున్నా.. నాకు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం ఆ రెండు భాషల్లోనూ రూపొందించి పాన్‌ ఇండియా సింగిల్‌గా తీర్చిదిద్దాం. తెలుగు, తమిళ పరిశ్రమపై నా ప్రేమ తెలియజేయడానికి దీన్నో అవకాశంగా ఉపయోగించుకున్నా’ అన్నారు. ఈ వీడియో గీతాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌, నిర్మాత జక్కీ భగ్నానీతో కలిసి రూపొందించారు. రకుల్‌ ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కి జోడీగా ఓ సినిమా  షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ద్విభాషా చిత్రం ‘31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌’తో వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని