Chiranjeevi: పరిశ్రమలో విజయోత్సాహం

చాలా రోజుల తర్వాత బాక్సాఫీసు వసూళ్లతో కళకళలాడుతోంది. మూలనపడిన హౌస్‌ఫుల్‌ బోర్డులు థియేటర్ల గేట్లకు మళ్లీ వేలాడాయి. ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలూ విజయం దిశగా దూసుకెళుతుండడంతో చిత్రసీమలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ...

Updated : 07 Aug 2022 03:25 IST

చాలా రోజుల తర్వాత బాక్సాఫీసు వసూళ్లతో కళకళలాడుతోంది. మూలనపడిన హౌస్‌ఫుల్‌ బోర్డులు థియేటర్ల గేట్లకు మళ్లీ వేలాడాయి. ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలూ విజయం దిశగా దూసుకెళుతుండడంతో చిత్రసీమలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ... ‘‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న పరిశ్రమకి ఎంతో ఊరటని, ప్రోత్సాహాన్ని అందించారు. కంటెంట్‌ బాగుంటే ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి నిరూపిస్తూ రెండు చిత్రాలకి విజయాల్ని కట్టబెట్టడం సంతోషకరం’’ అంటూ ట్వీట్‌ చేశారు. నిర్మాతల మండలి కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల ఓ ప్రకటనని విడుదల చేశారు. ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాల విజయం పరిశ్రమలో ఓ పండగ వాతావరణాన్ని సృష్టించాయని అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని