Nithya Menen: ఆరేళ్లుగా వేధిస్తున్నాడు

సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనని ఆరేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నటి నిత్యామేనన్‌ ఆరోపించారు. ఇటీవల తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై స్పందిస్తూ ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు  కొట్టడానికి

Updated : 08 Aug 2022 03:44 IST

సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనని ఆరేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నటి నిత్యామేనన్‌ ఆరోపించారు. ఇటీవల తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై స్పందిస్తూ ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు  కొట్టడానికి కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. అతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచే ఈ వార్తలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే.. అతను నన్ను, నా కుటుంబాన్ని దాదాపు ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. దాంతో మా ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎన్నోసార్లు చెప్పారు. కానీ, నేనలా చేయకుండా క్షమించి  వదిలేశా. ‘అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దామ’ని ఇంట్లో వాళ్లకు చెప్పా. కానీ, అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడు’’ అని నిత్యామేనన్‌ వివరించారు.
ః తనపై నిత్యా చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు సంతోష్‌. నిత్యాకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల అమ్మ చెబితే.. తండ్రి ఏమో జరగలేదని చెప్పారని, తనపై లైంగిక దాడుల ఆరోపణలు చేశారని అన్నాడు. ‘‘ఒకప్పుడు నిత్యాపై ప్రేమ ఉన్న మాట వాస్తవమే. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ, ఇప్పుడు చచ్చినా ఆమెను చేసుకోను. తన గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించే వాడినే కాదు’’ అని సంతోష్‌ వర్కీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని