Nagarjuna: కిల్లింగ్‌ మెషిన్‌ వచ్చేస్తోంది

నాగార్జున ‘ది ఘోస్ట్‌’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రమిది. నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక.

Published : 09 Aug 2022 03:44 IST

నాగార్జున ‘ది ఘోస్ట్‌’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రమిది. నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్‌తో పాటు కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘అక్టోబర్‌ 5న కిల్లింగ్‌ మెషిన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లలో కలుద్దాం’’ అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను జత చేశారు. సరికొత్త యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నాగార్జున, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ అధికారుల్లా కనిపించనున్నారు. గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భరత్‌ - సౌరభ్‌, ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts