Tollywood: నిర్మాతలకు ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు: ప్రతాని రామకృష్ణ గౌడ్‌

‘‘నిర్మాతలకు తమ సినిమాల్ని తామే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. వారిపై ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు. ఒకవేళ పెడితే.. రిలీజ్‌కు థియేటర్స్‌ కూడా పర్సెంటేజ్‌ విధానంలో ఇవ్వాలి. ఇదే మా టీఎఫ్‌సీసీ డిమాండ్‌’’ అన్నారు తెలంగాణ

Updated : 09 Aug 2022 09:14 IST

‘‘నిర్మాతలకు తమ సినిమాల్ని తామే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. వారిపై ఏ అసోసియేషన్‌ ఆంక్షలు పెట్టొద్దు. ఒకవేళ పెడితే.. రిలీజ్‌కు థియేటర్స్‌ కూడా పర్సెంటేజ్‌ విధానంలో ఇవ్వాలి. ఇదే మా టీఎఫ్‌సీసీ డిమాండ్‌’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌. మలేషియాలో ఉన్న ‘సన్‌ షైన్‌’ ఓటీటీ సంస్థను టీఎఫ్‌సీసీతో కలిసి త్వరలో ఇండియాలో ప్రారంభించనున్నారు బొల్లు నాగ శివప్రసాద్‌. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత్‌లో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగుతో పాటు అన్ని భాషల చిత్రాల్ని విడుదల చేయనున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్తబ్దత ఉంది. నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న వాటితో నేను ఏకీభవించను. నిర్మాత తన సినిమాని ఎప్పుడు అమ్మాలో తనే నిర్ణయించుకోవాలి తప్ప.. ఏ అసోసియోషనో, మరో సంస్థో చెప్పడం కరెక్ట్‌ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్‌ ఇవ్వరు.. ఓటీటీలో అమ్ముకునే అవకాశం ఇవ్వమంటే ఎలా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.గురురాజ్‌, తరుణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts