Adi Saikumar: అమ్మ జోలికొస్తే..!

‘‘నేను బతికున్నంత వరకు కంచు కోటలాగ నీ చుట్టూ ఉంటా. నేను చస్తే కూడా దెయ్యం లాగా నీ చుట్టూనే ఉంటా. అంతే నా ప్రేమ’’ అంటున్నారు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా కల్యాణ్‌ జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’.

Published : 09 Aug 2022 03:44 IST

‘‘నేను బతికున్నంత వరకు కంచు కోటలాగ నీ చుట్టూ ఉంటా. నేను చస్తే కూడా దెయ్యం లాగా నీ చుట్టూనే ఉంటా. అంతే నా ప్రేమ’’ అంటున్నారు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా కల్యాణ్‌ జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మించారు. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. పూర్ణ, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే  సోమవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘మా అమ్మను తప్పుగా చూశారు. మా అమ్మ జోలికొస్తే  ఏ అమ్మ కొడుకునైనా కొడతా’’ అంటూ సంభాషణతో మొదలైన ట్రైలర్‌.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ‘‘ఈ సినిమాలో ఆది స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌గా మూడు భిన్నమైన గెటప్పుల్లో  కనిపిస్తున్నారు. ఆది ఫైట్స్‌, పాయల్‌ అందాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ’’ని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: బాల్‌ రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని