Nara Rohit: దోస్త్‌ అంటే నువ్వేరా..

ఉదయ్‌ శంకర్‌, జన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌ జంటగా గురు పవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. అట్లూరి నారాయణరావు నిర్మాత. సుమన్‌, మధునందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా..

Published : 09 Aug 2022 03:44 IST

దయ్‌ శంకర్‌, జన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌ జంటగా గురు పవన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. అట్లూరి నారాయణరావు నిర్మాత. సుమన్‌, మధునందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో విడుదల కానుంది. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ చిత్రంలోని ‘‘దోస్త్‌ అంటే నువ్వేరా..’’ గీతాన్ని హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ పాటకు గిప్టన్‌ ఎలియాస్‌ స్వరాలు సమకూర్చగా.. మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర కథ.. కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పాట మంచి హిట్టవుతుందని నా నమ్మకం. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్‌. ఈ చిత్రానికి కూర్పు: సాగర్‌ ఉడగండ్ల, ఛాయాగ్రహణం: సిద్దం మనోహర్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని