Pushparaj: ‘పుష్పరాజ్‌’..ట్రైలర్‌ విడుదల

ధ్రువ సర్జా హీరోగా చేతన్‌ కుమార్‌ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘పుష్పరాజ్‌ ది సోల్జర్‌’. ఈ సినిమాని ‘పుష్పరాజ్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు  బొడ్డు అశోక్‌, కె.రవీంద్ర కల్యాణ్. రచితా రామ్‌ నాయిక.

Published : 09 Aug 2022 03:44 IST

ధ్రువ సర్జా హీరోగా చేతన్‌ కుమార్‌ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘పుష్పరాజ్‌ ది సోల్జర్‌’. ఈ సినిమాని ‘పుష్పరాజ్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు  బొడ్డు అశోక్‌, కె.రవీంద్ర కల్యాణ్. రచితా రామ్‌ నాయిక. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర పాటలు, ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ఈ చిత్రాన్ని మా బ్యానర్లలో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్‌ అద్భుతంగా వచ్చింది. ఆగస్టు 27న   విడుదల కానున్న మా చిత్రాన్ని అందరూ  ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య కిరణ్‌, టి.ప్రసన్న కుమార్‌, శ్రీనివాస్‌, రేణుక తదితరులు పాల్గొన్నారు.


‘మనుచరిత్ర’ కథేంటి?

శివ కందుకూరి హీరోగా భరత్‌ పెదగాని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మనుచరిత్ర’. నరాల శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. మేఘా ఆకాష్‌, ప్రియ వడ్లమాని, ప్రగతి  శ్రీవాత్సవ్‌ కథానాయికలు. ఈ సినిమా తాజాగా నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వరంగల్‌  నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. శివ కందుకూరి లుక్‌, ఆయన నటన కొత్తగా ఉంటాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: గోపీ సుందర్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని