Rajani Kanth: రంగంలోకి రజనీ

రజనీకాంత్‌ సెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Published : 10 Aug 2022 04:16 IST

రజనీకాంత్‌ సెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. దీనిపై రజనీ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఆయన ఇటీవల చెన్నైలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘జైలర్‌’ షూట్‌పై ప్రశ్నించగా.. ‘‘రెగ్యులర్‌ చిత్రీకరణ ఆగస్టు 15న లేదా 22న ప్రారంభమవుతుంద’’ని చెప్పారు. ఈ సినిమా కోసం ఇప్పటికే భాగ్యనగరంలోని ఓ స్టూడియోలో భారీ జైల్‌ సెట్‌తో పాటు కొన్ని కీలక సెట్లను నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని