Chandramukhi 2:‘చంద్రముఖి-2’ షెడ్యూల్‌ పూర్తి

రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. 2005లో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘చంద్రముఖి’కి సీక్వెల్‌ ఇది.

Updated : 10 Aug 2022 03:26 IST

రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘చంద్రముఖి-2’. 2005లో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘చంద్రముఖి’కి సీక్వెల్‌ ఇది. తొలిభాగానికి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ రెండో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు. వడివేలు, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలో  పోషిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తైయినట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. దీనికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: ఆర్‌డీ రాజశేఖర్‌. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని