Anand Devarakonda: ఆసక్తికర మలుపులతో ‘హైవే’

ఆనంద్‌ దేవరకొండ, అభిషేక్‌ బెనర్జీ ప్రధాన పాత్రల్లో కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘హైవే’. మానస కథానాయిక. సయామీ ఖేర్‌ కీలక పాత్రలో నటించింది.

Updated : 10 Aug 2022 03:23 IST

ఆనంద్‌ దేవరకొండ, అభిషేక్‌ బెనర్జీ ప్రధాన పాత్రల్లో కె.వి.గుహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘హైవే’. మానస కథానాయిక. సయామీ ఖేర్‌ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 19న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా. కథలో మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. కథలోకి వెళ్లే కొద్దీ విభిన్న షేడ్స్‌ ఉన్న పాత్రలు కనిపిస్తాయి. ఈ సినిమా తప్పకుండా  ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.


చింతామణి భర్త ఎవరు?

రాజేంద్రప్రసాద్‌, మధు ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చింతామణి సొంత మొగుడు’. శివ నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌ చూడగానే కొంతమంది వేరే విధంగా ఆలోచిస్తారు. చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్న ఈ చిత్రంలో చింతామణికి ఎవరు సొంత మొగుడవుతారన్నది సస్పెన్స్‌. సినిమా చూసిన ప్రతిఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో  విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి, సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌, ఆనంద్‌ భారతి, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మంచి కథతో చేసిన ప్రయోగం

సాక్షి, రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ సంధ్య ప్రధాన పాత్రల్లో రామ్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘ద్రౌపది’.  బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మాత. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర పాటలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో చేసిన ప్రయోగమిది. అంతా కొత్త వారితో చేశాం. టైటిల్‌ పాత్రలో సాక్షి చక్కగా నటించింది. తనకిది తొలి చిత్రమైనా.. అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్‌ కుమార్‌, సాక్షి, బ్రహ్మచార్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts