Swathi Muthyam: దసరాకి ‘స్వాతిముత్యం’

గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పకులు.

Updated : 11 Aug 2022 12:04 IST

ణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పకులు. స్వాతిముత్యంలాంటి ఓ యువకుడి కథతో రూపొందిన ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు నిర్మాత ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల మధ్య సాగిన ఓ యువకుడి ప్రయాణమే ఈ చిత్రం. ప్రేమ, వినోదం, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ చిత్రం ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుంది. కథా బలమున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.  ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌. ఛాయాగ్రహణం: సూర్య, కూర్పు: నవీన్‌ నూలి, కళ: అవినాష్‌ కొల్లా.


‘లెహరాయి’ పాట

రంజిత్‌, సౌమ్య మేనన్‌ జంటగా  నటించిన చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాత. బెక్కం వేణుగోపాల్‌ సమర్పకులు. ఈ సినిమాలోని ‘అరే చెప్పకు రా మామ... నువ్వు చెప్పకు సారీ’ అంటూ సాగే పాటని విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు అనిల్‌  రావిపూడి. ‘‘ఇందులో ఏడు పాటలున్నాయి. ప్రతి పాట దేనికదే వైవిధ్యంగా ఉంటుంది. 90వ దశకంలో ట్రెండింగ్‌ పాటల్ని అందించిన ఘంటాడి కృష్ణ మళ్లీ తనదైన ముద్ర వేస్తూ బాణీల్ని అందించారు. పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన రామకృష్ణ పరమహంస మంచి అనుభూతిని పంచేలా ఈ సినిమా తీశారు. త్వరలోనే  విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. గగన్‌ విహారి, రావు రమేష్‌, నరేష్‌, అలీ, సత్యం రాజేశ్‌, జబర్దస్త్‌ రాంప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని