Published : 11 Aug 2022 02:16 IST

ఆ అమ్మాయి గురించి చెప్పడానికి!

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మాతలు. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పకులు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. ‘‘విలక్షణమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన కొత్త కొత్తగా... పాట ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వివేక్‌ సాగర్‌ స్వరపరిచిన ఈ సినిమాలోని మిగతా పాటలూ సంగీత ప్రియుల్ని అలరిస్తాయ’’ని సినీ వర్గాలు చెప్పాయి. శ్రీనివాస్‌ అవసరాల, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కళ: సాహి సురేష్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని