Naga Chaitanya: నా తొలి సినిమా అన్నట్టుంది!
‘‘సినిమాల్లో కథానాయకుడిగా కంటే... ప్రత్యేక పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం తొలిసారి వచ్చింది. ఇకపైనా ఈ తరహా ప్రయత్నాలు కొనసాగించాలనేంతగా ప్రభావం చూపించిందీ సినిమా’’ అన్నారు యువ కథానాయకుడు నాగచైతన్య. ఆయన ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఇటీవల నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’.
‘‘సినిమాల్లో కథానాయకుడిగా కంటే... ప్రత్యేక పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం తొలిసారి వచ్చింది. ఇకపైనా ఈ తరహా ప్రయత్నాలు కొనసాగించాలనేంతగా ప్రభావం చూపించిందీ సినిమా’’ అన్నారు యువ కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఇటీవల నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సమర్పకుడిగా గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ సందర్భంగా నాగచైతన్య బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన విషయాలివీ...
‘‘కొన్ని సినిమాల్లో పనిచేసిన అనుభవం, ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటిదే ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్‌ఖాన్‌ని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. తొలిసారి ఈ సినిమా కోసమని నాకు ఫోన్ చేశారాయన. అప్పుడు నేను నమ్మలేదు. అదే రోజు సాయంత్రం మళ్లీ ఆమిర్‌ఖాన్, ఆ తర్వాత దర్శకుడు అద్వైత్ చందన్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. నాది 20 నుంచి 30 నిమిషాల నిడివిగల పాత్రే. వినగానే చాలా నచ్చింది. నన్ను దృష్టిలో ఉంచుకునే ఇందులోని బాలరాజు పాత్రని తెలుగు కుర్రాడిగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర కోసమే ఆమిర్‌ఖాన్ మన ప్రాంతానికి వచ్చి నటించి వెళ్లారు. దీన్ని నాలుగు రోజులుగా పలు ప్రధాన నగరాల్లో చాలా మంది చూశారు. మెచ్చుకున్నారు’’.
* ‘‘1975 నుంచి మొదలయ్యే ఈ కథ మన దేశంలో జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనల్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేను గుంటూరు జిల్లాలోని బోడిపాలెంలో పుట్టిన బాలరాజు అనే యువకుడిగా కనిపిస్తా. ఆర్మీలోకి వెళ్లిన అతనికీ, కథా నాయకుడికీ మధ్య సంబంధమేమిటనేది తెరపైనే చూడాలి. కొత్త మార్కెట్లోకి నన్ను తీసుకెళుతున్న సినిమా ఇది. ఇదే నా తొలి సినిమా అన్నట్టుగా ఉంది. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కి వస్తారు. ఈమధ్య విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ అదే విషయాన్ని నిరూపించాయి. మంచి కథతో తెరకెక్కిన ‘లాల్‌సింగ్ చడ్డా’ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’’.
* ‘‘హిందీలో ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. బాలీవుడ్ అవకాశాల గురించి ఇంకా ఆలోచించలేదు. అయితే ఎక్కడి నుంచి అవకాశం వచ్చినా తెలుగుకే నా ప్రాధాన్యం. చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళ చిత్రాల్లోనూ నటిస్తా. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న నా తదుపరి సినిమా జనవరిలో కానీ, మార్చిలో కానీ విడుదలవుతుంది’’.
* ‘‘మల్టీస్టారర్ సినిమాలు చాలానే చేశా. అయితే వాటిలో నేనూ హీరోగానే కనిపిస్తా. హీరో పాత్రలు కొన్ని కొలతలకి అనుగుణంగానే ముందుకు సాగుతుంటాయి. ప్రత్యేక పాత్రలు అలా ఉండవు. నటించేటప్పుడూ ఏ భారం లేకుండా స్వేచ్ఛగా చేసే వెసులుబాటు ఉంటుంది. ఆమిర్‌ఖాన్ హీరో కాబట్టి నేను బాలరాజు పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయే ప్రయత్నం చేశా. సినీ పరిశ్రమల్ని పోల్చి చూడటం నాకు ఇష్టం ఉండదు. పని విషయంలో ఎవరి స్టైల్ వాళ్లది. ఏది తప్పు కాదు, ఏదీ సరైందని కాదు. ఆ పనితీరుని గౌరవించడానికి ఇష్టపడతా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్‌హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్‌ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..