మునుపెన్నడూ చూడని లుక్‌తో

కథానాయకుడు బాలకృష్ణ 108వ చిత్రం ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్నారు. దీన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 12 Aug 2022 01:41 IST

కథానాయకుడు బాలకృష్ణ 108వ చిత్రం ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్నారు. దీన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తమన్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్‌ను నెట్టింట పంచుకున్నారు.‘‘ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తారు. తమన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. త్వరలో చిత్రీకరణ పారంభమవుతుంది’’ అని దర్శకుడు అనిల్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సినిమా కోసం ఆయన ఓ విభిన్నమైన మాస్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. దీని చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని