Karthikeya 2: భారతీయతని చాటి చెప్పే ‘కార్తికేయ2’

‘‘మా సినిమాతో కృష్ణతత్వం గురించే కాదు... మన మూలాల్ని, భారతీయతని చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ2’. చందు మొండేటి దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల  హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎంపీ,  రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్‌,  తెలంగాణ రాష్ట్ర మంత్రి    తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు సినీ ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావు,

Updated : 13 Aug 2022 08:48 IST

‘‘మా సినిమాతో కృష్ణతత్వం గురించే కాదు... మన మూలాల్ని, భారతీయతని చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు నిఖిల్‌ (Nikhil). ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ2’ (Karthikeya 2). చందు మొండేటి దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల  హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎంపీ,  రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్‌,  తెలంగాణ రాష్ట్ర మంత్రి    తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు సినీ ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావు, అడవి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద గొప్పతనాన్ని చాటి చెబుతూనే ప్రేక్షకులకి థ్రిల్‌ని, వినోదాన్ని పంచుతుందీ చిత్రం. మంచి కథ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకి తరలివస్తారని ఇటీవల సినిమాలు చాటి చెప్పాయి. రెండున్నరేళ్లు కష్టపడి చేసిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు. విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా తెలుగులో ఎంతగా వసూలు చేస్తుందో, హిందీలోనూ అంత వసూలు చేస్తుంది. దక్షిణాది సినిమాల విజయ  పరంపరని కొనసాగించే చిత్రం అవుతుంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ‘‘ఈమధ్య చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇటీవల విడుదలైన రెండు చిత్రాలు మంచి వసూళ్లతో ప్రదర్శితమవుతున్నాయి. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఏ సినిమాకైనా విడుదల  విషయంలో ఇబ్బందులు ఎదురైతే నేను అండగా ఉంటా’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని