Tollywood: ‘దిల్‌వాలా’ ప్రారంభం

‘మత్తు వదలరా’, ‘సేనాపతి’ చిత్రాలతో ఆకట్టుకున్న నరేష్‌ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దిల్‌ వాలా’. శ్వేత అవస్తి కథా  నాయిక. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. నబీ షేక్‌, తూము నర్సింహా పటేల్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ

Updated : 13 Aug 2022 06:58 IST

‘మత్తు వదలరా’, ‘సేనాపతి’ చిత్రాలతో ఆకట్టుకున్న నరేష్‌ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దిల్‌ వాలా’ (DilWala). శ్వేత అవస్తి కథా  నాయిక. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. నబీ షేక్‌, తూము నర్సింహా పటేల్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు. నటుడు అలీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కథానాయకుడు అల్లరి నరేష్‌ స్క్రిప్ట్‌ని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ ‘‘నరేష్‌ అగస్త్య, రాజేంద్రప్రసాద్‌ చేసిన ‘సేనాపతి’ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాతే నరేష్‌ అగస్త్యకి కథ చెప్పా. ‘మెరిసే మెరిసే’ సినిమా చూసి శ్వేత అవస్తిని కథానాయికగా ఎంపిక చేసుకున్నాం. ఓ క్రైమ్‌ కామెడీ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. నరేష్‌ అగస్త్య మాట్లాడుతూ ‘‘తొలిసారి ఒక వాణిజ్యాంశాలతో కూడిన సినిమా చేస్తున్నా. ఈ కథతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. రాజేంద్రప్రసాద్‌, అలీ, అలీ రెజా, దేవ్‌గిల్‌, పోసాని, బ్రహ్మాజీ, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శంకర్‌, ఛాయాగ్రహణం: అనిత్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని