Cinema News: మరీ ఇంత అందమేంటి.. సిన్నీ సిన్నీ!

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. దీన్ని శశిధర్‌ చావలి తెరకెక్కిస్తున్నారు. బి.ఎన్‌.రావు నిర్మాత. నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ’’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల

Updated : 13 Aug 2022 08:54 IST

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’ (Mr King). దీన్ని శశిధర్‌ చావలి తెరకెక్కిస్తున్నారు. బి.ఎన్‌.రావు నిర్మాత. నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ’’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యమందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ‘‘యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల  తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: తన్వీర్‌ అంజుమ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని