Liger: కొనిస్తనే.. కోకా కోకా

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం

Updated : 13 Aug 2022 06:52 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ‘‘కొనిస్తనే కోకా కోకా’’ అనే పాట విడుదల చేశారు. దీనికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. రామ్‌ మిరియాల, గీతా మాధురి సంయుక్తంగా ఆలపించారు. పాటలో విజయ్‌, అనన్య వేసిన భాంగ్రా స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో పూరి అతిథిలా తళుక్కున మెరిశారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో తెరకెక్కిన యాక్షన్‌ చిత్రమిది. ఈ సినిమాకి కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని