Nenu Meeku Baga Kavalsina Vadini: ‘గ్యాంగ్‌లీడర్‌’ తరహాలో తీశాం

కిరణ్‌ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్‌ గాదె తెరకెక్కిస్తున్నారు.

Updated : 15 Aug 2022 06:52 IST

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (Nenu Meeku Baga Kavalsina Vadini). శ్రీధర్‌ గాదె తెరకెక్కిస్తున్నారు. సంజన ఆనంద్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్రంలోని ‘‘నచ్చావ్‌ అబ్బాయ్‌’’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘కథకు తగ్గట్లుగానే టైటిల్‌ ఖరారు చేశాం. చాలా ట్విస్ట్స్‌, టర్న్స్‌ ఉన్నాయి. మేము విడుదల చేసిన రెండు పాటలు అందరికీ నచ్చాయి అనుకుంటున్నా. నా చిన్నప్పుడు మణిశర్మ పాటలకు డ్యాన్స్‌ వేసేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయన  మ్యూజిక్‌లో డ్యాన్స్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులోని ఆరు పాటలూ బాగుంటాయి. భాస్కరభట్ల నా చిత్రాలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాస్తారు. పూర్తిస్థాయి మాస్‌ కామెడీ చిత్రమిది. మేము టీజర్‌లో చూపించిన దాని కంటే డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రంలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రథమార్ధమంతా వినోదాత్మకంగా ఉంటుంది. ద్వితీయార్ధం ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. చిరంజీవి ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా తరహాలో ప్లాన్‌ చేసి ఈ చిత్రం తీశాం. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు   దర్శకుడు శ్రీధర్‌. నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కిరణ్‌, శ్రీధర్‌లది చక్కటి కాంబినేషన్‌. వాళ్లు ఈ సినిమాకి బలమయ్యారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంజన, భరత్‌ రొంగలి, రాజ్‌  కె.నల్లి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని