పండుగాడ్‌ మెప్పిస్తాడు

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులు. శ్రీధర్‌ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా

Published : 16 Aug 2022 02:44 IST

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులు. శ్రీధర్‌ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ‘పెళ్లిసందడి’ జోడీ రోషన్‌, శ్రీలీల ముఖ్య అతిథులుగా హాజరై తొలి టికెట్‌ని ఆవిష్కరించారు.కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘సినిమాలకి పూర్వవైభవం వచ్చింది. ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ2’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. వినోదాత్మక చిత్రంగా రూపొందిన ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ సైతం ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు. కార్యక్రమంలో అనసూయ, బి.వి.ఎస్‌.రవి, దుబాయ్‌ శర్మ, వసంతి, దీపికా, పృథ్వీ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts