లైలా ‘హత్య’ కేసు ఏమైంది?

విజయ్‌ ఆంటోనీ డిటెక్టివ్‌ పాత్రలో నటించిన చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. లోటస్‌ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మీనాక్షి చౌదరి కథానాయిక. రితికా సింగ్‌ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Published : 16 Aug 2022 02:44 IST

విజయ్‌ ఆంటోనీ డిటెక్టివ్‌ పాత్రలో నటించిన చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. లోటస్‌ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మీనాక్షి చౌదరి కథానాయిక. రితికా సింగ్‌ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘ఇతర భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు. మర్డర్‌ మిస్టరీ కథాంశంతో రూపొందిన చిత్రమిది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెరకెక్కించారు. గిరీష్‌ హాలీవుడ్‌ స్థాయి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘లైలా అనే అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆమెను ఎవరు హత్య చేశారు? ఎలా చేశారు? అనే ప్రశ్నలు కథలో కీలకంగా ఉంటాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘నేనిందులో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. ఇది నా డ్రీమ్‌ రోల్‌. నా మేకోవర్‌ స్టైలిష్‌గా ఉంటుంది. మీనాక్షితో నాకు ఎక్కువ సీన్స్‌ ఉంటాయి’’ అంది రితికా సింగ్‌. ‘‘ఇది దర్శకుడి కలకు ప్రతిరూపం. ప్రతి టెక్నీషియన్‌ అద్భుతంగా పనిచేశారు. విజయ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. హత్య ఒక స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుంది’’ అంది మరో నాయిక మీనాక్షి. కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్‌, జి.ధనుంజయన్‌, సిద్ధార్థ్‌ శంకర్‌, గిరీష్‌ గోపాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts