ఎమ్మెల్యే నారాయణస్వామిగా..

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రధారులు. వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మాతలు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌

Published : 16 Aug 2022 02:44 IST

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’. రాజేంద్రప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రధారులు. వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మాతలు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ లుక్‌ని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఎమ్మెల్యే నారాయణస్వామి పాత్రలో ఆయన నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. విలువలు, నిజాయతీ కలిగిన జాతీయ నాయకుడిగా రాజేంద్రప్రసాద్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని