కొత్త చిత్రం.. వచ్చే వేసవి నుంచి

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో సినిమా వచ్చే ఏడాది వేసవిలో మొదలు కానుంది. ఆ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోమవారమే ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌తో

Published : 16 Aug 2022 02:44 IST

న్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో సినిమా వచ్చే ఏడాది వేసవిలో మొదలు కానుంది. ఆ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోమవారమే ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌తో తీయనున్న కొత్త సినిమాని ఏప్రిల్‌, మే నెలల్లోనే ప్రారంభించనున్నట్టు ప్రశాంత్‌నీల్‌ సోమవారం మీడియాతో వెల్లడించారు. అంటే ఒకవైపు ‘సలార్‌’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతూనే, మరోపక్క ఎన్టీఆర్‌ సినిమాని షురూ చేస్తారన్నమాట. ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన 30వ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం పూర్వ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts