ఒకటే కదా.. ఒకటే సదా ఈ జీవితం

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా శ్రీకార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మించారు.

Published : 17 Aug 2022 06:20 IST

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా శ్రీకార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మించారు. అమల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమాలోని ‘‘ఒకటే కదా.. ఒకటే సదా..ఈ జీవితం’’ అనే పాట విడుదల చేశారు. ఈ గీతానికి జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. గౌతమ్‌ భరద్వాజ్‌ ఆలపించారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని