Balakrishna: టర్కీ వెళ్లనున్న బాలకృష్ణ

నిర్మాతలు చిత్రీకరణల్ని నిలిపివేయడంతో ఎక్కడి  సినిమాలు అక్కడ ఆగిపోయాయి. అగ్ర కథా నాయకుడు బాలకృష్ణ నటిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్‌కి బ్రేక్‌ పడింది.

Updated : 18 Aug 2022 14:03 IST

నిర్మాతలు చిత్రీకరణల్ని నిలిపివేయడంతో ఎక్కడి  సినిమాలు అక్కడ ఆగిపోయాయి. అగ్ర కథా నాయకుడు బాలకృష్ణ నటిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్‌కి బ్రేక్‌ పడింది. చిత్రీకరణలు పునః ప్రారంభమైతే మళ్లీ చిత్రసీమ సందడిగా మారనుంది. అగ్ర తారల సినిమాలన్నీ ఒకొక్కటిగా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. పలు చిత్రాలు ప్రారంభం కానున్నాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ సినిమా టర్కీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఆ మేరకు సినీ వర్గాలు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని