Published : 18 Aug 2022 06:04 IST

అందమైన ప్రేమకథా చిత్రమిది

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా మోహనకృష్ణ  ఇంద్రగంటి తెర   కెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు     పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే    బుధవారం హైదరాబాద్‌లో దర్శకుడు హను   రాఘవపూడి ‘‘మీరే హీరో లాగున్నారు’’ పాట  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మోహనకృష్ణకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలన్నీ సహజంగా ఉంటాయి. సుధీర్‌బాబు ప్రతిసారీ కొత్తగా కనిపిస్తారు. నిజంగా చాలా మందికి ఆయన స్ఫూర్తి. కృతి ‘ఉప్పెన’లో అద్భుతంగా చేశారు’’ అన్నారు. ‘‘అందమైన ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉన్న చిత్రమిది. ఇంద్రగంటి బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఈ చిత్రంతో తను టాలీవుడ్‌లో స్థిరపడిపోతుంది. పీజీ విందాతో నాకిది నాలుగో సినిమా. వివేక్‌ సాగర్‌ మంచి పాటలిచ్చారు. ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో సుధీర్‌బాబు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.. ‘‘ఓ ఇంటర్వ్యూ తరహాలో హీరో ఇంట్రో పాట ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రికి చెప్పాను. ఆయన వెంటనే నన్ను పాతిక ప్రశ్నలు అడిగారు. చిన్న ఎత్తిపొడుపు, చమత్కారం, చిన్న సంఘర్షణ.. ఇలా చాలా ఆఫ్షన్స్‌ ఇచ్చారు. అయితే ఈ పాటకు బాణీలు కట్టడం సవాల్‌తో కూడుకున్న పని. వివేక్‌ అద్భుతంగా స్వరాలందించార’’న్నారు. ‘‘ఈ చిత్రంలో సుధీర్‌ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నటనకు ఆస్కారముండే మంచి పాత్ర ఇచ్చినందుకు ఇంద్రగంటికి థ్యాంక్స్‌’’ అంది నాయిక కృతి శెట్టి. ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, వివేక్‌ సాగర్‌, గాజులపల్లె సుధీర్‌బాబు, పీజీ విందా, సాహి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని