Published : 18 Aug 2022 02:38 IST

ఎవరమ్మా ఆ చిన్నవాడు?

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాణ వర్గాలు   వెల్లడించాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పవిత్రమైన... స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. మంచి కాన్సెప్ట్‌తో...  సగటు చిత్రాలకి భిన్నంగా సాగుతుంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే భావోద్వేగాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతుంద’’న్నారు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ముల్లేటి  నాగేశ్వరరావు. తనికెళ్ల భరణి, కల్పనారెడ్డి, జీవా, జోగి బ్రదర్స్‌  తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌కుమార్‌, ఛాయాగ్రహణం: పి.వంశీప్రకాశ్‌.


వినూత్నమైన ‘ఐక్యూ’

సాయి చరణ్‌, పల్లవి జంటగా శ్రీనివాస్‌ జి.ఎల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖిశీ’. కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్‌ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇటీవల విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘వినూత్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం సత్యప్రకాష్‌పై ఓ ఐటెం గీతం చిత్రీకరిస్తున్నాం. సినిమాలో రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. ఇందులో ప్రతి పాత్ర హైలైట్‌ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘటికాచలం, ఛాయాగ్రహణం: సురేందర్‌ రెడ్డి.


ఓ దొంగ జీవితం

శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా... సతీష్‌ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ప్రీతి అస్రాణి కథానాయిక. సముద్రఖని ముఖ్యభూమిక పోషించారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాతలు    అధికారికంగా ప్రకటించారు. ‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగులో ఈ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదే. దొంగతనం బెడిసి కొట్టిన తర్వాత ఓ దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందనే విషయాన్ని ఆసక్తికరంగా తెరపై చూపిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: యశ్వంత్‌.సి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని