SSMB 28: మహేష్‌ 28... ఏప్రిల్‌ 28న

ఈ ఏడాది పట్టాలెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. మహేష్‌ 28వ సినిమా ఇది. చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు

Updated : 19 Aug 2022 07:08 IST

ఈ ఏడాది పట్టాలెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. మహేష్‌ 28వ సినిమా ఇది. చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు గురువారం ఓ ప్రత్యేక వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. వచ్చే వేసవిలో మహేష్‌ సినిమా హంగామా కొనసాగుతుందన్నమాట. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న సినిమా ఇది. పూజాహెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మహేష్‌బాబు ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన లుక్‌ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన  విషయాలు, ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్, కూర్పు: నవీన్‌ నూలి, సంగీతం: తమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని