పుట్టినరోజు బహుమానం

చిరంజీవి కథానాయకుడిగా...మోహన్‌రాజా దర్శకత్వంలో తెర  కెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన

Updated : 19 Aug 2022 04:58 IST

చిరంజీవి కథానాయకుడిగా...మోహన్‌రాజా దర్శకత్వంలో తెర  కెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. చిరంజీవి  పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిపింది చిత్రబృందం. ‘‘రాజకీయం నేపథ్యంలో సాగే చిత్రమిది. చిరంజీవి స్టైలిష్‌గా కనిపిస్తారు. చాలా కాలం తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో ఇలాంటి ఓ కొత్త రకమైన లుక్‌లో కనిపిస్తారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే టీజర్‌తో సినిమా ఎలా ఉండనుందో చెబుతాం. దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా, కళ: సురేష్‌ సెల్వరాజన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts