Tollywood: దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

హాలీవుడ్‌తోపాటు... హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ దర్శకనిర్మాత, ఛాయాగ్రాహకుడు రాజేంద్రప్రసాద్‌ (56) కన్నుమూశారు. ఆయన ‘ఆ నలుగురు’ దర్శకుడు చంద్రసిద్ధార్థకి సోదరుడు. ముంబయిలో స్థిరపడిన రాజేంద్రప్రసాద్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని నివాసంలోనే శుక్రవారం

Updated : 20 Aug 2022 09:28 IST

హాలీవుడ్‌తోపాటు... హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ దర్శకనిర్మాత, ఛాయాగ్రాహకుడు రాజేంద్రప్రసాద్‌ (56) కన్నుమూశారు. ఆయన ‘ఆ నలుగురు’ దర్శకుడు చంద్రసిద్ధార్థకి సోదరుడు. ముంబయిలో స్థిరపడిన రాజేంద్రప్రసాద్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని నివాసంలోనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1995లో వచ్చిన ‘నిరంతరం’ సినిమాకి రాజేంద్రప్రసాద్‌ దర్శకనిర్మాత, రచయిత. ఆ చిత్రం అప్పట్లో కైరో చలన చిత్రోత్సవాలకి ఎంపికైంది. హాలీవుడ్‌లో ‘మేన్‌ విమన్‌ అండ్‌ ది మౌస్‌’, ‘రెస్క్యూ - దేర్‌ ది ట్రూత్‌ లైస్‌’, ‘ఆల్‌ లైట్స్‌ నో స్టార్స్‌’ తదితర చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు, ఆయనే     రచయిత. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని